NC24: నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్ అప్డేట్..

NC24: నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్ అప్డేట్..

‘తండేల్’ సక్సెస్ తర్వాత మరో వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాగ చైతన్య. ‘విరూపాక్ష’ఫేమ్ కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగ చైతన్య నటిస్తున్న 24వ చిత్రమిది. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్  ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. 

నేడు శుక్రవారం (జులై4న) మూవీ తిరిగి కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. నాగ చైతన్య ఒక పికాక్స్ మరియు జనపనార తాడు పట్టుకుని కనిపిస్తున్న కొత్త పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో "ఒక అడుగు లోతుగా, ఒక ఊపు దగ్గరగా" అనే క్యాప్షన్ అంచనాలు పెంచుతోంది.

' NC24 మళ్ళీ మొదలైంది.. రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. మూడు వేర్వేరు ప్రదేశాలలో చిత్రీకరించబడుతుంది.. ఇది ఉత్కంఠభరితమైన రైడ్‌గా ఉండబోతోందని' మేకర్స్ తెలిపారు.

ఇవాళ జూలై 4 నుండి NC24 హైదరాబాద్‌లో నెల రోజులపాటు కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఈ సెకండ్ షెడ్యూల్లో నాగ చైతన్యతో పాటు ప్రముఖ నటులు పాల్గొనున్నారు. కీలక సన్నివేశాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ సెట్ నిర్మించారు.

ఈ సినిమాలో చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో మీనాక్షి ఆర్కియాలజిస్ట్‌‌‌‌గా కనిపించనుందని టాక్. నిధి అన్వేషకుడిగా నాగ చైతన్య కనిపించనున్నాడు.

ALSO READ : కన్నప్ప మొదటి వారం బాక్సాఫీస్ అప్డేట్.. 

హిందీ మూవీ ‘లాపతా లేడీస్‌‌‌‌’ ఫేమ్ స్పర్ష్‌‌‌‌ శ్రీవాత్సవ ఇందులో విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. దర్శకుడు కార్తీక్ దండు గత చిత్రం ‘విరూపాక్ష’ తరహాలో ‘వృషకర్మ’ (కార్యసాధకుడు) అనే  వైవిధ్యమైన టైటిల్‌‌‌‌ను పరిశీలిస్తున్నారు.

డైరెక్టర్ కార్తీక్ దండు విజన్పై విరూపాక్ష మూవీతో ప్రతిఒక్కరికీ తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేకంగా, ఈ చిత్రానికి అధిక స్థాయిలో సీజీ వర్క్ ఉండనుందట. ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్‌ అనుభూతిని అందించేందుకు సహాయపడుతుంది. అందుకు తగ్గట్టుగానే నీల్ డి కున్హా డీవోపీగా, నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, నవీన్ నూలి ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.