Kannappa Box Office: కన్నప్ప మొదటి వారం బాక్సాఫీస్ అప్డేట్.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Kannappa Box Office: కన్నప్ప మొదటి వారం బాక్సాఫీస్ అప్డేట్.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?

భారీ అంచనాలతో, స్టార్ కాస్ట్‌తో విడుదలైన కన్నప్ప.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. మిక్స్డ్ టాక్తో కన్నప్ప తన అంచనాలను అందుకోలేకపోయింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన కన్నప్ప.. మొదటి వారం ముగిసేలోపు.. ఎటువంటి భారీ వృద్ధిని చూపించలేకపోయింది. ఇండియాలో ఇప్పటివరకు రూ.30.14 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక వరల్డ్ వైడ్గా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.55 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కన్నప్ప థియేటర్ ఆక్యుపెన్సీ:

'కన్నప్ప' థియేటర్ ఆక్యుపెన్సీతో కూడా ఇబ్బంది పడుతుంది. ఏడో రోజు(జులై3), తెలుగు వెర్షన్ 12.89% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చూసింది. మార్నింగ్ షోలు 11.06% ఉండగా.. నైట్ షోలకు 13.99%గా ఉంది కొద్దిగా మెరుగుపడింది. ఇలా గురువారం మొత్తం ఆక్యుపెన్సీ 6.61% మాత్రమే నమోదు చేసుకుంది. ఇక హిందీ వెర్షన్ పరిస్థితి ఐతే మరింత దారుణంగా ఉంది.

Also Read : తమ్ముడు’ X రివ్యూ.. నితిన్ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

సాక్నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం, 

జూన్ 27న మొదటి రోజు రూ.9.35 కోట్లు వసూలు చేసిన 'కన్నప్ప', శనివారం 23.53% పడిపోయి రూ.7.15 కోట్లు, ఆదివారం రూ.6.9 కోట్లు సంపాదించింది. ఆరు రోజుల్లో సినిమా మొత్తం వసూళ్లు రూ.28.65 నెట్ వసూళ్లు సాధించింది. ఇక రిలీజైన 7 రోజుల్లో రూ.30.10 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఎటువంటి భారీ వృద్ధిని చూపించలేకపోయింది. ఇక కన్నప్పకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

రోజు వారీ కన్నప్ప కలెక్షన్:

కన్నప్ప కలెక్షన్ డే 1- రూ. 9.25 కోట్లు
కన్నప్ప కలెక్షన్ డే 2- రూ. 7.15 కోట్లు
కన్నప్ప కలెక్షన్ డే 3-రూ. 6.9 కోట్లు
కన్నప్ప కలెక్షన్ డే 4- రూ. 2.30 కోట్లు
కన్నప్ప కలెక్షన్ డే 5- రూ. 1.18 కోట్లు
కన్నప్ప కలెక్షన్ డే 6- రూ. 1.35 కోట్లు
కనప్ప కలెక్షన్ డే 7- రూ. 1.25 కోట్లు
మొత్తం కన్నప్ప నెట్  కలెక్షన్: రూ. 30.14 కోట్లు.(Appro)