Thammudu X Review: ‘తమ్ముడు’ X రివ్యూ.. నితిన్ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Thammudu X Review: ‘తమ్ముడు’ X రివ్యూ.. నితిన్ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషించింది. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్గా నటించారు. ఇవాళ శుక్రవారం (జులై 4న) థియేటర్లలో సినిమా విడుదలైంది. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‍, యాక్షన్ ప్రధానంగా మూవీ తెరెకెక్కింది.

వరుస పరాజయాలు తర్వాత నితిన్ తమ్ముడు మూవీతో వచ్చాడు. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో నెటిజన్ల అభిప్రాయాలు, రివ్యూలు ఎలా ఉన్నాయనేది X లో (గతంలో ట్విట్టర్) చూద్దాం. 

నితిన్ తమ్ముడు మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. కుటుంబ విలువలతోపాటు మంచి ఎమోషనల్ రైడ్ పంచే సినిమా ఇదని అంటున్నారు. మరికొందరు మీ సహనాన్ని పరీక్షించే ఒక పేలవమైన యాక్షన్-అడ్వెంచర్ డ్రామా అని అని పోస్టులు పెడుతున్నారు. అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తమ్ముడి పాత్రలో నితిన్ నటించాడు. చాలా కాలం తర్వాత నితిన్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని, యాక్షన్ అంశాలతో అదరగొట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ పర్వాలేదని.. సెకండాఫ్‌లో ఫైట్‌ సీక్వెన్స్‌ అదిరిపోతాయని ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాధ్ బ్యాక్ గ్రౌండ్ బీజీఎమ్ ఇంపాక్ట్ కలిగించిందని అంటున్నారు. లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ తమ పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషన్ ఇచ్చారని X లో రివ్యూస్ ఇస్తున్నారు.

ఓ నెటిజన్ తన రివ్యూను పంచుకుంటూ.. 'తమ్ముడు మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ లు ఉన్నాయి. చాలా కాలం తర్వాత నితిన్ మంచి సినిమాతో వచ్చాడు. మూవీలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ లు అభిమానులు ఫుల్ మీల్స్. తమ్ముడు ఒక మంచి సినిమా. థియేటర్లలో తప్పకుండా చూడండి' అని పోస్ట్ పెట్టాడు.

మరో నెటిజన్ రివ్యూను షేర్ చేస్తూ.. "తమ్ముడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీ సహనాన్ని పరీక్షిస్తుంది. ఒక పేలవమైన యాక్షన్-అడ్వెంచర్ డ్రామా. దర్శకుడు వేణు శ్రీరామ్ ఆసక్తికరమైన నేపథ్యంతో ఒక ప్రత్యేకమైన యాక్షన్-అడ్వెంచర్ మూవీని అందించడానికి ప్రయత్నించాడు. అయితే, అతను పూర్తిగా విఫలమయ్యాడు. తెరపై వచ్చే సీన్స్ కొన్నిసార్లు అంతగా అర్ధమయ్యే స్థాయిలో ఉండవు. సినిమాలో అక్క తమ్ముడి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బలంగా లేవు. విలన్ పాత్ర కొంతవరకు చెప్పుకోదగ్గట్టుగా ఉంది. సినిమాలో ఏదైతే బలమైన పాయింట్ ఉంటుందో.. అది అమలు చేసే క్రమంలో మేకర్స్ తడబడ్డాడని" నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.