Vaishnavi Chaitanya: ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య కోలీవుడ్ ఎంట్రీ.. జీవీ ప్రకాష్ సరసన హీరోయిన్ ఛాన్స్

Vaishnavi Chaitanya: ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య కోలీవుడ్ ఎంట్రీ.. జీవీ ప్రకాష్ సరసన హీరోయిన్ ఛాన్స్

బేబీ' చిత్రంతో ఓవర్‌‌నైట్ స్టార్‌‌డమ్ తెచ్చుకున్న నటి వైష్ణవి చైతన్య.. కోలీవుడ్‌‌ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  సంగీత దర్శకుడిగానే కాక నటుడిగానూ బిజీగా ఉన్న జీవీ ప్రకాష్, ప్రస్తుతం వరుసగా వినూత్న చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన హీరోగా విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో వైష్ణవి చైతన్యను హీరోయిన్‌‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

గతంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వలిమై’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన వైష్ణవి.. ఇప్పుడు జీవీ ప్రకాష్​ సినిమాతో హీరోయిన్‌‌గా పూర్తి స్థాయిలో కోలీవుడ్‌‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక లవ్‌‌ మీ, జాక్‌‌ చిత్రాల్లో నటించిన వైష్ణవికి ఆశించిన స్థాయి విజయాలు రాలేదు.

ప్రస్తుతం ‘బేబి’ కాంబినేషన్‌‌ను రిపీట్ చేస్తూ ఆనంద్‌‌ దేవరకొండకు జంటగా ‘ఎపిక్‌‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె కడలి అనే పాత్ర పోషిస్తోంది. ‘90స్‌‌’ వెబ్ సిరీస్‌‌ ఫేమ్ ఆదిత్య హసన్‌‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ నిర్మిస్తోంది.