IND vs ZIM: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా ఈరోజు ( ఫిబ్రవరి 26న) భారత్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలో మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించే వారికి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారు మెట్రో ట్రైన్ లలో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చునని వెల్లడించింది. మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి వెళ్లి రావొచ్చు అని పేర్కొనింది.
టీ20 ప్రపంచ కప్ 2026 యొక్క సూపర్–8 మ్యాచ్‌కి హాజరయ్యే అభిమానుల సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)తో ప్రత్యేక సహకారాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. భారత్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7 గంటలకు చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనుంది. మ్యాచ్ టిక్కెట్లు (ప్రత్యేకమైన QR కోడ్‌లు) CMRL మెట్రో టిక్కెట్లుగా కూడా పని చేయనున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో ఒక రౌండ్ ట్రిప్‌కు మాత్రమే చెల్లు బాటు అవుతుందని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) ప్రకటన జారీ చేసింది.
సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే జింబాబ్వే జట్టుపై టీమిండియా భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం అప్పుడు భారత జట్టు సెమీఫైనల్ రేసు నుంచి నిష్ర్కమిస్తుంది. మరోవైపు, జింబాబ్వే టీమ్ పరిస్థితి కూడా సేమ్ భారత జట్టులాగానే ఉంది. గెలిస్తేనే సెమీస్ ఛాన్స్.. లేదంటే ఇంటికి వెళ్లిపోవాల్సిందే.
Metro Rail Service to Provide Extended Train Service to Cater to Audience for T20 World Cup Cricket Match in Chennai
— Chennai Metro Rail (@cmrlofficial) February 25, 2026
Chennai Metro Rail Limited (CMRL) is delighted to announce a special collaboration with Tamil Nadu Cricket Association (TNCA) to ensure seamless and convenient…
