నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు : భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు..

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు : భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ప్రాజెక్ట్ ఇంజినీర్–-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.  

ఖాళీలు: 07 ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్). 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీబీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

లాస్ట్ డేట్: మార్చి 15. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (85 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ (15 శాతం వెయిటేజీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు .

పూర్తి వివరాలకు  bel-india.in వెబ్​సైట్​ను సందర్శించండి.

►ALSO READ | డిగ్రీ అర్హతతో MECLలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ! నెలకు రూ. 60వేల జీతం..