అరుణాచలానికి ఆర్టీసీ బస్ సౌకర్యం

 అరుణాచలానికి ఆర్టీసీ బస్ సౌకర్యం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలానికి సూపర్ లక్సరీ బస్ సౌకర్యం కల్పించినట్లు ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పి.రవికుమార్ గురువారం తెలిపారు. అరుణాచలం యాత్ర కోసం ఈనెల 8న మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు ఆర్మూర్​ నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. మొదట కాణిపాకం, వెలూర్ లోని గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలంకు 10న గురువారం ఉదయం చేరుకుంటుందని చెప్పారు.

అరుణాచలం గిరి ప్రదక్షిణ, దర్శనం చేసుకుంటూ తిరుగు ప్రయాణంలో జోగులాంబ శక్తిపీఠం దర్శనం పూర్తి చేసుకొని 11న శుక్రవారం రాత్రి ఆర్మూర్​ చేరుకుంటుందన్నారు. చార్జీలు పెద్దలకు రూ.5100/-, పిల్లలకు రూ.2600 నిర్ణయించారు. ముందస్తుగా ఆన్ లైన్ రిజర్వేషన్ కౌంటర్ లో టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం అధికారిక వెబ్ సైట్ WWW.tgsrtc.in <http://WWW.tgsrtc.in> లో ఉందని తెలిపారు.