- కొన్ని నెలలుగా ఖమేనీతో పాటు ఇరాన్ లీడర్లపై నిఘా పెట్టినం
వాషింగ్టన్: అమెరికాతో కలిసి ఇరాన్ సీనియర్ లీడర్లతో పాటు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై కొన్ని నెలల నుంచి నిఘా పెట్టామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ నేతల గురించి పక్కా సమాచారాన్ని తమ రెండు ఇంటెలిజెన్స్ అధికారులు పంచుకొని, పగటిపూటే ఆ దేశంపై దాడి చేశామన్నారు. ఖమేనీతో సహా రివల్యూషనరీ గార్డ్స్ నాయకులు ఒక చోట సమావేశం అవుతున్నారన్న విషయం తెలుసుకొని అత్యంత కచ్చితత్వంతో, కేవలం 60 సెకన్లలో పని పూర్తి చేశామని తెలిపారు.
సాధారణంగా రాత్రి వేళల్లో దాడులు జరుగుతాయని, కానీ, పగటిపూట దాడి చేస్తామని శత్రువు ఊహించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. మొదటి దాడి జరిగిన వెంటనే ఇతర నాయకులు తప్పించుకోకుండా ఉండేందుకు వరుసగా దాడులు చేశామని వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్, అమెరికా దళాలు పూర్తి సమన్వయంతో పనిచేశాయని చెప్పారు. కాగా, దాడులకు కొన్ని నెలల ముందు నుంచే అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇజ్రాయెల్ మొస్సాద్ కలిసి ఇరాన్ ముఖ్య నాయకుల కదలికలను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు
