న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు భీకరంగా తలపడుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా ఇప్పుడు సైబర్ వార్‌లోకి దిగాయి. ఇజ్రాయెల్ – అమెరికాకు చెందిన హ్యాకర్లు ఇరాన్ ప్రభుత్వ వెబ్ సైట్లు, మిలిటరీ, క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రకర్లే లక్ష్యంగా సైబర్ దాడులకు దిగుతున్నారు. ఇరాన్ కూడా తమ శత్రు దేశ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను టార్గెట్‌గా చేసుకుని సైబర్ దాడికి దిగింది.
తాజాగా ఇరాన్‌కు చెందిన బడేసాబా క్యాలెండర్ యాప్‌ను ఇజ్రాయెల్ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ‘హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మమ్మల్ని నమ్మండి’ అంటూ యూజర్లకు నోటిఫికేషన్లు వెళ్లాయి. ఈ యాప్ హ్యాక్ అయిందని, దానికి సంబంధించిన స్ర్కీన్ షాట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి.
