
ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియాపై ఇంగ్లాండ్ ఎదురు దాడికి దిగింది. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టును హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా స్మిత్ టీ20 శైలిలో చెలరేగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో ఇంగ్లాండ్ మూడో రోజు రెండో సెషన్ లో టీమిండియాపై ఆధిపత్యం చూపించింది. ప్రస్తుతం 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజ్ లో స్మిత్ (84), బ్రూక్ (70) ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 377 పరుగులు వెనకపడి ఉంది.
మూడో రోజు తొలి సెషన్ లో స్మిత్ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. 5 వికెట్లు పడినా వేగంగా ఆడుతూ భారత బౌలర్లను ఆడుకున్నాడు. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ రెండు, మూడు బంతులకు సిక్సర్, ఫోర్ బాదిన ఈ ఇంగ్లీష్ వికెట్ కీపర్.. చివరి మూడు బంతులను ఫోర్లుగా మలిచాడు. అంతటితో ఆగకుండా ప్రసిద్ వేసిన 34 ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదాడు. దీంతో 6 బంతుల్లోనే 28 పరుగులు పిండుకున్నాడు. ప్రసిద్ తో పాటు బ్రూక్ వేగంగా ఆడుతున్నాడు. వీరిద్దరూ 6 వికెట్ కు అజేయంగా 126 పరుగులు జోడించి పరిస్థితితిని చక్కదిద్దారు.
వరుస బంతుల్లో సిరాజ్ వికెట్లు:
77 పరుగులకు మూడు వికెట్లతో ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఆకాష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే ఒక ఫోర్ తో ఆరు పరుగులు రాబట్టింది. అయితే ఆ తర్వాత సిరాజ్ వేసిన 22 ఓవర్ లో ఇంగ్లాండ్ కు బిగ్ షాగింది. మూడో బంతిని లెగ్ సైడ్ కు దూరంగా విసిరాడు. రూట్ ఈ బంతిని కదిలించుకోవడంతో వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ వెళ్ళింది. రూట్ తన షాట్ సెల్కషన్ కారణంగానే ఈ వికెట్ పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బంతికే ఒక అద్భుతమైన ఎక్స్ ట్రా బౌన్సర్ తో స్టోక్స్ ను బోల్తా కొట్టించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ALSO READ : నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. వరుస బంతుల్లో రూట్, స్టోక్స్ ఔట్
23 runs conceded by Prasidh Krishna in his 6th over against Jamie Smith🤯🤯
— Cricbuzz (@cricbuzz) July 4, 2025
Smith also brings up his 50 as well 🔥#jamiesmith #prasidhkrishna #ENGvsIND pic.twitter.com/vqxewkrhvf