
ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్ ఇంగ్లాండ్ కు దడ పుట్టిస్తున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆట ప్రారంభమైన రెండో ఓవర్లోనే నిప్పులు చెరిగే బంతులతో స్టార్ బ్యాటర్ రూట్, స్టోక్స్ లను ఔట్ చేశాడు. మూడో రోజు సిరాజ్ కు ఇదే తొలి ఓవర్ కావడం విశేషం. ఇన్నింగ్స్ 22 ఓవర్ మూడు, నాలుగు బంతులకు ఈ వికెట్లు తీయడం విశేషం. దీంతో ఇంగ్లాండ్ 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 494 పరుగులు వెనకపడి ఉంది. క్రీజ్ లో స్మిత్ (4), బ్రూక్ (32) ఉన్నారు.
77 పరుగులకు మూడు వికెట్లతో ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఆకాష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే ఒక ఫోర్ తో ఆరు పరుగులు రాబట్టింది. అయితే ఆ తర్వాత సిరాజ్ వేసిన 22 ఓవర్ లో ఇంగ్లాండ్ కు బిగ్ షాగింది. మూడో బంతిని లెగ్ సైడ్ కు దూరంగా విసిరాడు. రూట్ ఈ బంతిని కదిలించుకోవడంతో వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ వెళ్ళింది. రూట్ తన షాట్ సెల్కషన్ కారణంగానే ఈ వికెట్ పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బంతికే ఒక అద్భుతమైన ఎక్స్ ట్రా బౌన్సర్ తో స్టోక్స్ ను బోల్తా కొట్టించాడు.
సిరాజ్ వేసిన అనూహ్య బౌన్సర్ ను ఊహించని స్టోక్స్.. పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చూస్తుంటే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవడం దాదాపు అసాధ్యం. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Early success on Day 3 for #TeamIndia ✅
— BCCI (@BCCI) July 4, 2025
Mohammed Siraj is on a roll here at Edgbaston! ⚡️ ⚡️
England 5 down as Joe Root & Ben Stokes depart.
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @mdsirajofficial pic.twitter.com/Y41zkQfz7X