
2024 ప్రారంభం వరకు టీమిండియా ఆటగాడు శుభమాన్ గిల్ టెస్టుల్లో రికార్డ్ దారుణంగా ఉంది. ఒక బ్యాటర్ గా జట్టులో కొనసాగించడంపై ప్రతి ఒక్కరూ విమర్శించారు. ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై సిరీస్ కు ముందు టెస్టుల్లో గిల్ యావరేజ్ కనీసం 30 కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు గురి చేసింది. ఫ్యూచర్ స్టార్ గా అందరి ప్రశసంలు అందుకున్న ఈ యువ కెరటం ఫామ్ భారత్ జట్టుకు భారంగా మారింది. ముఖ్యంగా టెస్టుల్లో పరుగులు చేయడంలో తడబడ్డాడు. ఒకానొక దశలో వరుసగా 10 ఇన్నింగ్స్ లు చూసుకుంటే ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ అందుకోలేకపోయాడు.
స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన 2024 సిరీస్ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో 23,34 పరుగులు చేసి టెస్ట్ జట్టులో తన స్థానాన్ని ప్రస్నార్ధకం చేసుకున్నాడు. సీనియర్ ప్లేయర్ పుజారాను జట్టులోకి తీసుకోరావాలని డిమాండ్ చేశారు. వరుసగా విమర్శల నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ గిల్ కు మద్దతుగా నిలిచాడు. గిల్ వరుసగా విఫలమవుతున్న అతడిని జట్టులో కొనసాగించాలని ఈ ఇంగ్లీష్ మాజీ స్టార్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ కలిస్ తో పోల్చాడు.
కల్లిస్ టెస్టు కెరీర్ చూసుకుంటే తొలి 10 టెస్టుల్లో యావరేజ్ 22 మాత్రమే ఉంది. ఆ తర్వాత గొప్పగా ఆడి టాప్ ప్లేయర్ గా నిలిచాడు.గిల్ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. అతనొక సీరియస్ ప్లేయర్. జట్టు యాజమాన్యం అతడిపై నమ్మకముంచాలి. అని పీటర్సన్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. పీటర్సన్ ఈ ట్వీట్ చేసినప్పటి దగ్గర నుంచి గిల్ పరుగుల వరద పారించడం విశేషం. 2024లో సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ చేసిన గిల్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన గిల్.. అదే ఫామ్ ను కొనసాగించాడు.
తన బ్యాటింగ్ తో గిల్ ప్రపంచ క్రికెట్ లో తన ఉనికిని చాటుతున్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి సిరీస్ లోనే వరుస సెంచరీలతో హోరెత్తించాడు. వేదికగా జరిగిన తొలి టెస్టులో 147 పరుగులు చేసిన గిల్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం గిల్ టెస్టు కెరీర్ యావరేజ్ 40 దాటింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కెవిన్ పీటర్సన్ ఒక సంవత్సరం క్రితం చేసిన పాత్ ట్వీట్ వైరల్ అవుతుంది. పీటర్సన్ కూడా గిల్ డబుల్ సెంచరీ తర్వాత నా ట్వీట్ ను ఒకసారి గుర్తు చేసుకోండి అని తన ఎక్స్ లో రాసుకొని రావడం విశేషం.
Remember my tweet about @ShubmanGill ? pic.twitter.com/7cGKPNxrZ4
— Kevin Pietersen🦏 (@KP24) July 3, 2025