T20 World Cup: పాక్‌‌‌‌‌‌‌‌ గెలిచినా ఇంటికే.. 5 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతోశ్రీలంకపై విజయం

T20 World Cup: పాక్‌‌‌‌‌‌‌‌ గెలిచినా ఇంటికే.. 5 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతోశ్రీలంకపై విజయం

పల్లెకెలె: బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (60 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 100), ఫకర్‌‌‌‌‌‌‌‌ జమాన్‌‌‌‌‌‌‌‌ (42 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 84) దంచికొట్టినా.. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను సెమీస్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లలేకపోయారు. శ్రీలంకను 148 రన్స్‌‌‌‌‌‌‌‌ లోపు కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కావడంతో ఇంటిముఖం పట్టక తప్పలేదు. దాంతో శనివారం జరిగిన సూపర్‌‌‌‌‌‌‌‌–8 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ 5 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లంకపై గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన పాక్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 212/8 స్కోరు చేసింది. ఆరంభం నుంచే లంక బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఈ ఇద్దరు ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోశారు. దాంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో 64 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈ జోడీ 9.5 ఓవర్లలోనే స్కోరును వంద దాటించింది.  

ఈ క్రమంలో ఫర్హాన్‌‌‌‌‌‌‌‌ 32, జమాన్‌‌‌‌‌‌‌‌ 27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. వీళ్లను కట్టడి చేసేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు 16వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో చమీరా (1/48) జమాన్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 176 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యాన్ని ముగించాడు. ఇక్కడి నుంచి లంక బౌలర్లు పట్టు బిగించారు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో ఫర్హాన్‌‌‌‌‌‌‌‌ జోరుగా ఆడినా.. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో చకచకా వికెట్లు తీశారు. వరుస విరామాల్లో ఖవాజ నఫే (2), షాదాబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (7)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇక 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో షనక (2/42) డబుల్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో మహ్మద్‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌ (0), సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఆగా (0)ను డకౌట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాంతో స్కోరు 199/5గా మారింది. ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌లో మధుశనక (3/33) ఐదు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఫర్హాన్‌‌‌‌‌‌‌‌తో పాటు షాహీన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది (4), నసీమ్‌‌‌‌‌‌‌‌ షా (1)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపినా పాక్‌‌‌‌‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక 20 ఓవర్లలో 207/6 స్కోరుకే పరిమితమైంది. 

కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డాసున్‌‌‌‌‌‌‌‌ షనక (31 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 8 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 76 నాటౌట్‌‌‌‌‌‌‌‌), పవన్‌‌‌‌‌‌‌‌ రత్నాయకే (58) చెలరేగారు. పాథుమ్‌‌‌‌‌‌‌‌ నిశాంక (3) విఫలమైనా, కమిల్‌‌‌‌‌‌‌‌ మిశ్రా (26), చరిత్‌‌‌‌‌‌‌‌ అసలంక (25) పోరాటం చేశారు. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు విజృంభించడంతో లంక 101/5 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన షనక విశ్వరూపం చూపెట్టాడు. 

పాక్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఉతికి ఆరేసి పవన్‌‌‌‌‌‌‌‌తో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 61, దునిత్‌‌‌‌‌‌‌‌ వెల్లలాగే (2 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. చివరి ఓవర్‌‌‌‌‌‌‌‌లో 28 రన్స్‌‌‌‌‌‌‌‌ కావాల్సిన దశలో 4, 6, 6, 6 దంచాడు. చివరి రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఆరు రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం కాగా షాహీన్‌‌‌‌‌‌‌‌ రెండు డాట్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ వేసి పాక్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాడు. ఫర్హాన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

176  ఫకర్‌‌‌‌‌‌‌‌ జమాన్‌‌‌‌‌‌‌‌, సాహిబ్జాదా ఫర్హాన్‌‌‌‌‌‌‌‌  నెలకొల్పిన భాగస్వామ్యం టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఏ వికెట్‌‌‌‌‌‌‌‌కైనా అత్యధికం. సిఫర్ట్‌‌‌‌‌‌‌‌, ఫిన్‌‌‌‌‌‌‌‌ అలెన్‌‌‌‌‌‌‌‌ రికార్డు (175)ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

మరిన్ని వార్తలు