IND VS ENG 2025: 80 బంతుల్లోనే స్మిత్ సెంచరీ.. ఆసక్తికరంగా ఎడ్జ్ బాస్టన్ టెస్ట్

IND VS ENG 2025: 80 బంతుల్లోనే స్మిత్ సెంచరీ.. ఆసక్తికరంగా ఎడ్జ్ బాస్టన్ టెస్ట్

ఏకపక్షంగా మారుతుందనుకున్న ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి రెండు రోజులు భారత్ ఆధిపత్యం చూపించినా.. ఒక్క సెషన్ లో ఇంగ్లాండ్ దూకుడు ధాటికి టీమిండియా వెనకడుగు వేసింది. వికెట్ కీపర్ జెమీ స్మిత్, వైస్ కెప్టెన్ బ్రూక్ ఎదురు దాడికి దిగడంతో ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. స్మిత్ 80 బంతుల్లోనే సెంచరీ చేస్తే.. బ్రూక్ 91 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసి భారత్ కు ఛాలెంజ్ విసురుతుంది. క్రీజ్ లో బ్రూక్ (91), స్మిత్ (102) ఉన్నారు. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులు వెనకబడి ఉంది. రెండో సెషన్ లో అటు కీలకం కానుంది. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టును హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా స్మిత్ టీ20 శైలిలో చెలరేగుతూ పరుగుల వరద పారించాడు. ప్రసిద్ కృష్ణను టార్గెట్ చేసి బౌండరీల వర్షం కురిపించాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో ఇంగ్లాండ్ మూడో రోజు రెండో సెషన్ లో టీమిండియాపై ఆధిపత్యం చూపించింది. వీరిద్దరూ 6 వికెట్ కు అజేయంగా 165 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మిత్ హాఫ్ సెంచరీతో పాటు తన సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. మరోవైపు బ్రూక్ (91) తనదైన శైలిలో చెలరేగాడు.

ALSO READ : వరుసగా 4,6,4,4,4,6: టెస్టుల్లో టీ20 విధ్వంసం.. ప్రసిద్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్

77 పరుగులకు మూడు వికెట్లతో ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఆకాష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే ఒక ఫోర్ తో ఆరు పరుగులు రాబట్టింది. అయితే ఆ తర్వాత సిరాజ్ వేసిన 22 ఓవర్ లో ఇంగ్లాండ్ కు బిగ్ షాగింది. మూడో బంతిని లెగ్ సైడ్ కు దూరంగా విసిరాడు. రూట్ ఈ బంతిని కదిలించుకోవడంతో వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ వెళ్ళింది. రూట్ తన షాట్ సెల్కషన్ కారణంగానే ఈ వికెట్ పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బంతికే ఒక అద్భుతమైన ఎక్స్ ట్రా బౌన్సర్ తో స్టోక్స్ ను బోల్తా కొట్టించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది.