గూగుల్ AI ఫోన్.. అక్షరాలు, ఫొటోలు ఇస్తే వీడియో చేసి ఇచ్చేస్తోంది..

గూగుల్ AI ఫోన్.. అక్షరాలు, ఫొటోలు ఇస్తే వీడియో చేసి ఇచ్చేస్తోంది..

టిక్ టాక్ బ్యాన్ తరువాత షాట్ వీడియోస్ క్రేజ్ భారీగా పెరిగింది. ఈ సమయంలోనే ఇన్స్ట రీల్స్ పాపులర్ అయ్యింది కూడా. అయితే ఇండియాలో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ కోసం చాల రకాల యాప్స్, ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటన్నిటిని  దృష్టిలో పెట్టుకొని  ఇప్పుడు గూగుల్ ఒక ఆడుగు ముందుకు వేసింది. 

ఇండియాలోని కంటెంట్ క్రియేటర్స్ కోసం గూగుల్ లేటెస్ట్ AI వీడియో జనరేషన్ మోడల్ Veo 3ని లాంచ్ చేసింది. మొదట్లో Google I/O 2025లో చూపించినసప్పటికీ ఈ టూల్  ఇప్పుడు జెమిని యాప్‌లోని Google AI Pro సబ్‌స్క్రిప్షన్ ద్వారా ప్రపంచవ్యాప్త లాంచ్‌లో భాగంగా వస్తుంది. దీనితో ఇప్పుడు భారతీయ కంటెంట్ క్రియేటర్స్'కి ఇతర దేశాల్లో ఇప్పటికే ట్రెండింగ్‌లో  ఉన్న అడ్వాన్స్డ్  AI వీడియో ఫీచర్స్  ఆక్సెస్ లభిస్తుంది.

టెక్స్ట్ లేదా ఫోటోలు ఉపయోగించి 8-సెకన్లనే వీడియోలు : 
Veo 3 ఉపయోగించేవారు సాధారణ టెక్స్ట్ అంటే పదాలు లేదా ఫోటోలు ఉపయోగించి 8 సెకన్ల చిన్న వీడియోలను రూపొందించవచ్చు.  ఇది మార్కెటింగ్ వీడియో క్లిప్ అయినా, ఎడ్యుకేషన్ యానిమేషన్ అయినా లేదా క్రియేటివిటీ కోసం అయినా Veo 3 ప్రొఫెషనల్-గ్రేడ్ వీడియో ప్రొడక్షన్‌ త్వరగా అందించగలదు, దింతో ఇప్పుడు కాస్ట్లీ  డివైజెస్  లేదా వీడియో ఎడిటింగ్ స్కిల్స్  లేకున్న వీడియోలు చేయవచ్చు. 

సౌండ్, వాయిస్ కూడా : వీయో 3 బెస్ట్ ఫీచర్స్'లో ఇది ఒకటి, ఏంటంటే జనరేట్ చేసిన వీడియోలకు మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్‌లు అలాగే మీ  వాయిస్ జోడించవచ్చు. దింతో మరింత బెస్ట్  అండ్ రియాలిటీ కంటెంట్ వస్తుంది. AI-జనరేటెడ్ ఫోటోస్, సౌండ్స్, ఫోటోల ఆధారంగా   కథలు చెప్పడం, బ్రాండింగ్ చేయడం,  సోషల్ మీడియా ట్రెండ్‌లకు కూడా అనువైనవిగా చేస్తాయి.

వాటర్‌మార్కింగ్ సిస్టం : Veo 3తో క్రియేట్ చేసిన ప్రతి వీడియోలో రెండు రకాల వాటర్‌మార్క్‌లు ఉంటాయి:
1. కనిపించేలాగ AI- జనరేటెడ్” లేబుల్
2. Google DeepMind ద్వారా కనిపించని SynthID డిజిటల్ వాటర్‌మార్క్. ఈ సిస్టం AI ద్వారా క్రియేట్ చేసిన వీడియో కంటెంట్‌ను గుర్తించగలిగేలా చేస్తుంది. 

గూగుల్  Veo 3 బాధ్యతలను కూడా నొక్కి చెప్పింది. హానికరమైన, తప్పుదారి పట్టించే లేదా అసురక్షిత కంటెంట్‌ను ఉత్పత్తి చేయడానికి ఈ టూల్  ఉపయోగించలేరని ఇందుకు కంపెనీ ఇంటర్నల్ టెస్టింగ్, రెడ్ టీమింగ్ అండ్  పాలసీ చెక్ కూడా నిర్వహించింది. థంబ్స్ అప్/డౌన్ వంటి యాప్‌లో ఫీడ్‌బ్యాక్ టూల్స్  యూజర్ల  అనుభవాన్ని పంచుకోవడానికి ఇంకా ఈ సిస్టం మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలిపింది. 

చదువుకునేవారి  నుండి చదువు చెప్పే వారు, ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే  డెవలపర్ల వరకు Veo 3 ఇండియాలో క్రియేటివిటీ వీడియోలను  ఉత్పత్తి చేసే అవకాశాలను తెరుస్తుంది. Google AI ప్రో ప్లాన్‌కు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు అన్ని లేటెస్ట్ టెక్స్ట్, ఇమేజ్ జనరేషన్ కోసం ఇతర జెమిని టూల్స్  కూడా ఉపయోగించుకోవచ్చు.