కాకా వల్లే సింగరేణి బతికిబయటపడింది: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాకా వల్లే సింగరేణి బతికిబయటపడింది: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాకా నిరంతరం కార్మికుల గురించే ఆలోచించే వారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  రవీంద్ర భారతితో కాకా జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.  ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్, పలువురు హజరయ్యారు.  ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు ఎమ్మెల్యే వినోద్.

అనంతరం మాట్లాడిన మంత్రి వివేక్..  కాంగ్రెస్ లో కాకా  అంచెలంచెలుగా ఎదిగారు.  ప్రైవేట్ సెక్టార్లో పెన్షన్ స్కీం తీసుకొచ్చింది కాకానే.కాక వల్లే సింగరేణి బతికి బయటపడింది.రూ. 400 కోట్ల రుణాలు ఇప్పించి సింగరేణిని కాపాడారు. వైఎస్సార్ తో మాట్లాడి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును  ఇప్పించారు..గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహితను పక్కన పెట్టేసింది.  పేద పిల్లల విద్యకు అంబేద్కర్ విద్యాంస్థలు అందించారు. అన్నపూర్ణ క్యాంటీన్లు తీసుకొచ్చింది కాకానే. కాకా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఆలోచించేవారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

అంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం,శ్రీధర్ బాబు,వివేక్, వాకిటి శ్రీహరి, ఎంపీ వంశీకృష్ణ,జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.