టామ్‌కామ్‌తో నిరుద్యోగులకు ఉపాధి : మంత్రి వివేక్ వెంకటస్వామి

టామ్‌కామ్‌తో నిరుద్యోగులకు ఉపాధి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగులకు టామ్‌కామ్ ( తెలంగాణ ఓవర్సీస్​ మ్యాన్‌ పవర్ కంపెనీ లిమిటెడ్ )  ద్వారా  ఉపాధి అవకాశాలు పెంచుతామని, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. శనివారం సెక్రటేరియెట్‌లో లేబర్ ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ శాఖ అధికారులతో మంత్రి వివేక్​ వెంకటస్వామి రివ్యూ చేశారు. 

 రాష్ట్రంలో ఉద్యోగావకాశాల విస్తరణ, యువతకు నైపుణ్యాభివృద్ధి పెంచే దిశగా చేపట్టనున్న కార్యక్రమాలు, విదేశీ ఉపాధి అవకాశాలపై  అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.  ప్రతి ఒక్క ఉద్యోగార్థికి సహకారం అందేలా చూడాలని సూచించారు. ఈ రివ్యూ సమావేశంలో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తాతోపాటు పలువురు ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు.