మల్లెపల్లిలో ఐటీఐ ఎక్స లెన్స్ అవార్డ్స్ ప్రదానం చేసిన మంత్రి వివేక్

మల్లెపల్లిలో ఐటీఐ ఎక్స లెన్స్ అవార్డ్స్ ప్రదానం చేసిన మంత్రి వివేక్

హైదరాబాద్ లోని మల్లేపల్లి ఐటీఐ కాలేజీలో ఎక్స లెన్స్ అవార్డ్స్ ను ప్రదానం చేశారు మంత్రి వివేక్  వెంకటస్వామి.  రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఐటీఐ పూర్తి చేసి స్వయంగా ఒక షాప్ స్థాపించి ఒక్కొక్కరు 20 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు విద్యార్థులు. 

ALSO READ | కొన్ని రోజులైతే కల్లుదుకాణం దగ్గర చర్చకు రమ్మంటడేమో: జగ్గారెడ్డి

ఎక్స్ లెన్స్ అవార్డ్స్ , విజన్ వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  మంత్రి వివేక్ వెంకటస్వామి..ఐటీఐ ఎక్స లెన్స్  అవార్డులు అందుకున్న విద్యార్థులకు  శుభాకాంక్షలు తెలిపారు. ఏటీసీ  సెంటర్లో అనుభవజ్ఞులైన విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. నాన్న కాకా  వెంకటస్వామి  కొన్ని ఏటీసీ సెంటర్లు స్థాపించి ఉపాధి కల్పించారని చెప్పారు.  ఐటీఐ,ఎలక్ట్రీషియన్ , రకరకాల ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు చాలా సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఐటీఐలో విద్యార్థులు కొత్త టెక్నాలజీ తో రాణించాలని సూచించారు. స్కిల్ డెవలప్ మెంట్  క్వాలిటీగా ఉండాలని చెప్పారు. ఇంత చక్కటి శిక్షణ ఇస్తున్న ప్రిన్సిపల్స్ కి లెక్చరర్లకి అభినందనలు తెలిపారు మంత్రి వివేక్.