
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సెకండ్ బెంచ్ లీడర్స్ అని అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. బనకచర్లపై చర్చిద్దాం రమ్మని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరితే..కేటీఆర్ చర్చకు వస్తానంటారేంటని ప్రశ్నించారు. రేవంత్, కేసీఆర్ మధ్యల ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకొస్తున్నారని అన్నారు జగ్గారెడ్డి.
ఎక్కడైనా ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మని ప్రతిపక్షం డిమాండ్ చేస్తది కానీ..తెలంగాణలో పరిస్థితి రివర్స్ లో ఉందన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ చర్చకు వస్తానంటే సీఎం అసెంబ్లీ పెడుతానంటున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి సవాల్ విసిరితే కేటీఆర్ మధ్యలొచ్చి..ప్రెస్ క్లబ్ కు రా..గోల్స్ క్లబ్ కు రా అంటున్నాడు..కొన్ని రోజులైతే కల్లు దుకాణం దగ్గర చర్చకు రమ్మంటాడేమోనని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి.
బనకచర్ల కానీ..రైతు సమస్యలపైన ఇతర ఏ సమస్యలపైనా కానీ చర్చకు సిద్ధమని ఎల్బీ స్టేడియం సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే..అయితే ఇవాళ జూలై 5న స్పందించిన కేటీఆర్ రేవంత్ సవాల్ కు తాను సిద్ధమని అన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరితే కేటీఆర్ వస్తానంటున్నారని ఫైర్ అవుతున్నారు.