సీఎం సవాల్ నీకు కాదు కేసీఆర్కు.. నీ డెడ్ లైన్ కోసం ఎవ్వరూ వెయిట్ చేయట్లే :మంత్రి సీతక్క

సీఎం సవాల్ నీకు కాదు కేసీఆర్కు.. నీ డెడ్ లైన్ కోసం ఎవ్వరూ వెయిట్ చేయట్లే :మంత్రి సీతక్క

కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కావట్లేదన్నారు మంత్రి సీతక్క..సీఎం సవాల్ విసిరింది కేటీఆర్ కు కాదు  కేసీఆర్ కు అని అన్నారు. ఒక  ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కు   సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే  కేటీఆర్ చర్చకు సిద్దం అనడం ఏంటి..? ఆయన డెడ్ లైన్ పెట్టడం ఏంటని  ప్రశ్నించారు. కేటీఆర్ డెడ్ లైన్ కోసం ఎవరూ వెయిట్ చేయట్లేదన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్ కు రావాలనడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్నది ప్రెస్ క్లబ్ లోనా అని ప్రశ్నించారు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం సరికాదన్నారు. కేటీఆర్ ను  లీడర్ గా  కవితే భావించడం లేదని  ఎద్దేవా చేశారు. అసలు బీఆర్ఎస్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సీతక్క.

ALSO READ | చర్చకు మేం సిద్ధం.. కేసీఆర్‎ను అసెంబ్లీకి రమ్మనండి: మంత్రి పొన్నం

కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రారు..కేటీఆర్ విదేశీ టూర్లు తిరగడమే సరిపోతుంది. కవితకు మరో సమస్య..ఇలా బీఆర్ ఎస్ లో ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. సమస్యలపై మాట్లాడుదామంటే భయమెందుకని ప్రశ్నించారు సీతక్క.

కేసీఆర్ కు రేవంత్ సవాల్

జూలై 4న  హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..   తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌‌‌‌గా నిలబెట్టామని అని అన్నారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని చేసి చూపించినం. ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతు భరోసా, సన్నొడ్లకు బోనస్, రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం పంపిణీతో తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం తెచ్చినం. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చర్చించేందుకు సిద్ధం.. చర్చకు ఎవరొస్తారో రండి.. కేసీఆర్, మోదీ, కిషన్​ రెడ్డి.. ఇలా ఎవరొచ్చినా సరే” అని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సవాల్ విసిరారు.  

సవాల్ కు సిద్ధమన్న కేటీఆర్

 సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు విసిరిన సవాలుపై జులై 5న కేటీఆర్ స్పందించారు. చర్చకు కేసీఆర్ రారని, తానే వస్తానని కేటీఆర్ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చించేందు కుతాను సిద్ధమన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో 8వ తేదీన 11 గంటలకు చర్చ వస్తామని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.  రాష్ట్రంలో 18 నెలలుగా తెలంగాణ టైమ్ పాస్ పాలన నడుస్తుందని, మీ స్తాయికి కేసీఆర్ అవసరం లేదని తాము చాలని చెప్పారు. ఎక్కడికి పిలిచిన రెడీ అన్నారు. 72 గంటల సమయం రేవంత్ కు ఇస్తున్నామని తెలిపారు. ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తున్నామన్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. సవాల్ విసిరింది కేసీఆర్ కు కాదన్నారు. కేటీఆర్ సవాల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.