చర్చకు మేం సిద్ధం.. కేసీఆర్‎ను అసెంబ్లీకి రమ్మనండి: మంత్రి పొన్నం

చర్చకు మేం సిద్ధం.. కేసీఆర్‎ను అసెంబ్లీకి రమ్మనండి: మంత్రి పొన్నం

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‎పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బనకచర్ల ఇష్యూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ శాసనసభ స్పీకర్‎కి లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విదేశాలకు వెళ్లడంతో ఈ విషయం కేటీఆర్‎కి తెలియకపోవచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చ జరగాలి.

అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సవాల్ చేయాల్సిన కేటీఆర్  ప్రెస్ క్లబ్‎లో చర్చ చేద్దాం అంటున్నారు. ప్రెస్ క్లబ్‎లో చర్చ చేయడం సరైన విధానం కాదు. తెలంగాణ ప్రజానీకానికి తెలియాలంటే అసెంబ్లీలోనే చర్చ జరగాలి. చర్చకు మేము సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్‎కు  సవాల్ విసురుతున్నా.. చర్చ బషీర్ బాగ్‎లో కాదు శాసన సభలో చేద్దాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయండని కేసీఆర్‎తో లేఖ రాయించండి. కేసీఆర్‎ను అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమని చెప్పండన్నారు. మేము చర్చకు బయపడే వాళ్లం కాదన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట సవాళ్లు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

Also Read :చర్చకు మేం సిద్ధం.. కేసీఆర్‎ను అసెంబ్లీకి రమ్మనండి

బనకచర్లకు పునాది వేసింది బీఆర్ఎస్.. బేసిన్లు, భేషజాలు లేవని ఏపీకి నీటిని కట్టబెట్టింది ఆ పార్టీనేనని ఆరోపించారు. గతంలో ఏపీ మాజీ సీఎం జగన్‎తో నీటి ఒప్పందాలు చేసుకుంది ఎవరని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లపై అప్పుడు మౌనంగా ఉన్నది ఎవరని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనేనని విమర్శించారు.