V6 News

గోదావరిఖనిలో మంత్రి వివేక్ పర్యటన

గోదావరిఖనిలో మంత్రి వివేక్ పర్యటన

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలో మంత్రి వివేక్​ వెంకటస్వామి బుధవారం పర్యటించారు. కాంగ్రెస్​ సీనియర్​ లీడర్ పి.మల్లికార్జున్​ తల్లి జయశ్రీ అనారోగ్యంతో సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొందుతున్నారు. ఆమెను బుధవారం మంత్రి పరామర్శించారు. జయశ్రీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం లయన్స్​ క్లబ్​ ప్రతినిధులు బంక రామస్వామి, కె.రాజేందర్​, తదితరులు మంత్రి వివేక్​ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత కాంగ్రెస్​ లీడర్​ రాచకొండ కోటేశ్వర్లు కూతురు అక్షయ-శశిధర్​నిశ్చితార్థం స్థానిక అడ్డగుంటపల్లిలోని ఫంక్షన్​హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగగా మంత్రి హాజరై  ఆశీర్వదించారు. మంత్రి వెంట లీడర్లు కామ విజయ్​, జావెద్​, తిప్పారపు మధు, నర్సింగ్​ దొర, మగ్గిడి దీపక్​, రఫిక్​, హకీమ్​, శ్యామసుందరాచారి, తదితరులున్నారు.