మత్తు వీడి మైదానాలకు రండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

మత్తు వీడి మైదానాలకు రండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

మత్తు వీడి మైదానాలకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సికింద్రాబాద్ లోని  జింఖానా గ్రౌండ్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి   మంత్రి వివేక్ వెంకట స్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ మెంబర్స్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా లక్ష బెలూన్స్ ప్రదర్శన చేశారు.  మత్తు వీడండి..గ్రౌండ్ లోకి రండంటూ  మంత్రి వివేక్ గాల్లోకి బెలూన్స్ వదిలారు. 

 అనంతరం మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి..సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే 10 మందికి సాయం చేస్తారని అన్నారు.  33 జిల్లాలో వాసవి క్లబ్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో చాలా మంది బిజినెస్ మెన్స్ చారిటీ చేస్తారు.. చారిటీ చేసే వారే  గొప్పగా ముందుకు రానిస్తారని తెలిపారు . సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉందన్న వివేక్...అన్ని ప్రాంతాల వారికి వాసవి క్లబ్ ఇచ్చే మెసేజ్ చేరుతుందన్నారు. తాను కూడా మొదట్లో వాసవి క్లబ్ గురుంచి చాలా విషయాలు తెలుసుకున్నానని వివేక్ అన్నారు.