సిద్దిపేట, వెలుగు: చిన్న కోడూరు మండలం విఠలాపూర్ సర్పంచ్ దాసరి నాగమణి ఎల్లంతో పాటు వార్డు సభ్యులు బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపడడానికి ఇది మరో నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో వివిధ పార్టీల నాయకులు, సర్పంచులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి పూజల హరికృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులకు మంత్రి వివేక్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
