జూబ్లీహిల్స్ బైపోల్..షేక్ పేటలో బూత్ స్థాయి ముఖ్య నేతలతో మంత్రి వివేక్ వెంకటస్వామి మీటింగ్

జూబ్లీహిల్స్ బైపోల్..షేక్ పేటలో  బూత్ స్థాయి  ముఖ్య నేతలతో మంత్రి వివేక్ వెంకటస్వామి  మీటింగ్

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారాన్ని కాంగ్రెస్ స్పీడప్ చేసింది.  ఇప్పటికే పలువురు మంత్రులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్  మంత్రి వివేక్ వెంకటస్వామి  ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్  రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందిని ప్రజలకు  వివరిస్తున్నారు. 

 అక్టోబర్ 27న  షేక్ పేట్ డివిజన్ లో ని  అజిజ్ బాగ్ కాలనీలో బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి   మంత్రి వివేక్ వెంకటస్వామి  హాజరయ్యారు.  నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, మాజీ ఎమ్మెల్యేలతో బూత్ స్థాయి ప్రెసిడెంట్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 70 మంది బూత్ ప్రెసిడెంట్స్  హాజరయ్యారు.  బూత్ కమిటీలా వారిగా బాధ్యతలు తీసుకుని పని చెయ్యాలని   మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు.  బూత్ బాధ్యతలు తీసుకున్నవారు ప్రతి ఓటర్ ను వెళ్లి కలవాలని సూచించారు.  ఓటర్ మ్యాపింగ్ పై దృష్టి పెట్టాలని చెప్పారు.

జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ మధ్య పోటీ ఉండనుంది.  నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా..14న కౌంటింగ్ జరగనుంది.