ఆవగింజలపై మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేరు

ఆవగింజలపై  మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేరు

తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్‌ వెంకటస్వామికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అల్వాల్‌కు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రదీప్‌ అనే సూక్ష్మ కళాకారుడు ఆవగింజలపై మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేరును చిత్రీకరించాడు. అగ్గిపుల్లపై ఆవగింజలు పెట్టి వాటిపై జీ వివేక్‌ వెంకటస్వామి అని రాశాడు. ఆవగింజలపై మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేరు చిత్రీకరించడంపై ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు.

జూన్ 8న రాజ్ భవన్ లో వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే..ఆయనతో  పాటు మరో ఇద్దరు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, గవర్నర్ పలువురు మంత్రులు పాల్గొన్నారు.

2009లో రాజకీయ ప్రస్థానం మొదలు

తండ్రి కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి  పెద్దపల్లి లోక్​సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి2014  మధ్య 15వ లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డిని ధిక్కరించి, ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని, అరెస్టయ్యారు. వీ 6 చానల్​ ను ప్రారంభించి, ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు