హోలీ సెలవు ఇవాళే (మార్చి 03).. స్కూళ్లకు హాలిడే !

హోలీ సెలవు ఇవాళే (మార్చి 03).. స్కూళ్లకు హాలిడే !

హోలీ పండుగపై సస్పెన్స్ వీడింది. పండుగ మంగళవారమా లేక బుధవారమా అనే విషయంలో క్లారిటీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పండుగను మంగళవారం (మార్చి 03) జరుపుకుంటుండటంతో.. స్కూళ్ల సెలవు ఎప్పుడనే అంశంపై గందరగోళం ఏర్పడింది. దీనిపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. మంగళవారమే పండుగ సెలవుగా ప్రకటించింది. 

వాస్తవానికి అకడమిక్ క్యాలెండర్ లో హోలీ సెలవు బుధవారం (మార్చి 04) గా ఉంది. మరోవైపు పండుగ మంగళవారమే అనటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో స్కూల్ ఉంటుందా అనే ఆందోళన మొదలైంది. దీనిపై స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్.. మార్చి 03న హోలీ సెలవు గా ప్రకటించారు. 

జ్యోతిష్య పండితులు.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాలప్రకారం హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం మార్చి 3 వ తేదీన ఏర్పడుతుంది.  హోలీ .. చంద్రగ్రహణం ఒకే రోజు వచ్చాయి .. హోలికాదహనం ఎప్పుడు చేయాలి.. హోలీ సంబరాలు ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో కూడా కొంత గందరగోళం ఏర్పడిందనే చెప్పాలి. 

అయితే  చంద్రగ్రహణం ముందు రోజు హోలికా దహనం జరుపుకోవాలని పండితులు సూచించడంతో.. సోమవారం (మార్చి 02) హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా హోలీ మంటలు కనిపించాయి. ఇక గ్రహణం రోజు కాకుండా తరువాతి రోజు.. అంటే మార్చి 04న  జరుపుకోవాలని పండితులు సూచించారు. కానీ  ప్రభుత్వ సెలవు మాత్రం మార్చి 03 నే  ప్రకటించడం గమనార్హం.