గోదావరిఖని, వెలుగు : రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం రామగుండం ప్రాంతంలో పర్యటించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో నివాసముండే ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధుకు ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరగగా ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
అలాగే రామగుండంలో కాంగ్రెస్ లీడర్ ఎండి జావీద్ అత్త జమిలా బేగం ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రి వెంట కాంగ్రెస్ లీడర్లు గుమ్మడి కుమారస్వామి, రాచకొండ కోటేశ్వర్లు, మల్లేశ్ యాదవ్, నర్సింగ్ దొర, గడ్డం మధు, తిప్పారపు మధు, మేకల సమ్మయ్య, తదితరులున్నారు.
