కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు మరవబోరు

కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు మరవబోరు

కరీంనగర్: కరీంనగర్ కు డెయిలీ వాటర్ సప్లై అందించాలన్న కల సాకరమైందన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. మంగ‌ళ‌వారం ఆయ‌న మంత్రి కేటీఆర్ తో క‌లిసి డెయిలీ వాటర్ సప్లై స్కీం ప్రారంబించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ..గతంలో రోజు విడిచి రోజు నీళ్లు వచ్చేవనని… ఇకపై ప్రతి రోజు నీటి సరఫరా అవుతుంద‌న్నారు.  హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ రంగాన్ని కరీంనగర్ కు తేవాలని ఇక్కడ 34 కోట్లతో ఐటీ టవర్ నిర్మించామ‌ని, కరీంనగర్ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్మించిన ఐటీ టవర్ ను శంకు స్థాపన చేసి, ప్రారంభించిన ఘనత కేటీఆర్ కే దక్కిందన్నారు.

ఓ వైపు ఐటీ టవర్ పూర్తి చేశామ‌ని.. మరోవైపు మానేరుపై కేబుల్ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావస్తున్నాయన్నారు. బ్రహ్మాండంగా కరీంనగర్ లో ప్రధాన రహదారులు నిర్మించామ‌ని చెప్పారు. అన్ని రకాలుగా కరీంనగర్ ను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు మరవబోరని తెలిపారు మంత్రి గంగుల‌.