భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 24న కలెక్టరేట్లో స్కిల్ డెవలప్మెంట్ట్రైనింగ్, జాబ్గ్యారెంటీ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేశ్వి.పాటిల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాజిస్టిక్స్స్కిల్కౌన్సిల్, రెడింగ్టన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత ట్రైనింగ్‌తోపాటు 100 శాతం ప్లేస్మెంట్ ఉంటుందన్నారు.
జిల్లాలోని అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రియల్ టైం ఫోర్క్ లిఫ్ట్ఆపరేటర్, సప్లై చైన్ అసోసియేట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ఎగ్జిక్యూటివ్పోస్టులకు సంబంధించి శిక్షణ ఇస్తారని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ట్రైనింగ్ తర్వాత ఉద్యోగంలో నెలకు రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకు జీతం అందుతుందన్నారు. శిక్షణ హైద్రాబాద్‌లో ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 79958 06182 ఫోన్నంబర్లో సంప్రదించాలని సూచించారు.
