
కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించడం రైతుల విజయమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. దేశంలో వాస్తవ పరిస్థితిని మోడీ సర్కారు ఇప్పటికైనా గుర్తించిందని చెప్పారు. రైతుల పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. సాగు చట్టాల ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు నిరంజన్ రెడ్డి. మరోవైపు విద్యుత్ చట్టాలను కూడా షరతులు లేకుండా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. దేశ రైతాంగానికి అన్యాయం జరిగినంత కాలం కేంద్రంపై కేసీఆర్ పోరాటం కొనసాగుతోంది.