
బంజారాహిల్స్, ఎన్‌బీటీ నగర్ లో 93.50 లక్షలతో నిర్మించిన మహిళా భవన్ ను మంత్రులు పొన్నం, సీతక్క ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కమీషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. రూ. 29.80 లక్షలతో నిర్మించనున్న అంగన్ వాడీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.
మహిళల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. మహిళలు అన్ని రంగాలలో ఎదగడానికి ప్రభుత్వం వెన్నుదన్ను అందిస్తుందని తెలిపారు. స్వయం ఉపాధి పథకాలలో మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. కోర్టు కేసులు పరిష్కారం చేసి మహిళా భవన్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. మహిళలకు సమావేశాల వేదికగా ఈ భవన్ ఉపయోగపడుతుందన్నారు.