జులై 18న దర్బార్ మైసమ్మకు పట్టు వస్త్రాలు .. సమర్పించనున్న మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్

జులై 18న దర్బార్ మైసమ్మకు పట్టు వస్త్రాలు .. సమర్పించనున్న మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్

మెహిదీపట్నం, వెలుగు: కార్వాన్ దర్బార్ మైసమ్మ, మహంకాళి అమ్మవార్లకు శుక్రవారం మిత్ర అసోసియేట్ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించనున్నట్లు మాజీ కార్పొరేటర్, కార్వాన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మిత్ర కృష్ణ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్​తో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారన్నారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బోనాల ఉత్సవాల్లో పాల్గొని సక్సెస్ చేయాలని కోరారు.