V6 News

కేసీఆర్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలం: తలసాని

కేసీఆర్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలం: తలసాని

కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలం అయ్యిందని మంత్రి తలసాని అన్నారు.  నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వద్ద  జరిగిన కైట్ ఫెస్టివల్ లో ఆయన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని 2014 వరకు నీళ్లు లేక పంటలు పండలేదన్నారు. కేసీఆర్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలం అయ్యిందని ..   రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు.  పాశ్యాత్య  మోజులో పండగ సంస్కృతిని మరిచిపోతున్నారని విమర్శించారు. పతంగులు ఎగరేద్దామంటే కనీసం గాలి కూడా రావడం లేదన్నారు.  ఒకప్పుడు కోనసీమ అన్నపూర్ణ రాష్ట్రంగా ఉండేదని..  ఇపుడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందన్నారు.