మైనారిటీ గురుకుల అడ్మిషన్‌‌‌‌ పోస్టర్ ఆవిష్కరణ

మైనారిటీ గురుకుల అడ్మిషన్‌‌‌‌ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్  టౌన్,వెలుగు: 2026-–27 ఏడాదికి సంబంధించి మైనారిటీ గురుకుల స్కూల్‌‌‌‌, కాలేజీ(బాయ్స్ 1 కరీంనగర్ విట్స్ క్యాంపస్)లో అడ్మిషన్ల పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ప్రిన్సిపాల్ మహేశ్‌‌‌‌.. మైనార్టీ లీడర్లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌‌‌‌ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌‌‌‌లో సెంటర్ ఆఫ్​ఎక్సలెన్స్‌‌‌‌లో ఐఐటీ, నీట్ ఎంట్రన్స్ లకు కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.

5,6,7,8 తరగతుల్లో మిగులు సీట్ల కోసం ఫిబ్రవరి 28లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం 73311 70844,7993 997564ను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్  షమి, లీడర్లు ఆరిఫ్​, జమీల్ అహ్మద్, తాజుద్దీన్, మొహిసిన్, మతీన్, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.