బాలుడిపై మైనర్ల లైంగిక వేధింపులు.. చేతిలో రూ. 20 పెట్టి..

బాలుడిపై మైనర్ల లైంగిక వేధింపులు.. చేతిలో రూ. 20 పెట్టి..

అలీఘర్: ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌లో దారుణం వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన అలీఘర్‌లోని లోథా ప్రాంతంలో చోటు చేసుకుంది.బాధిత బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ‘వ్యవసాయ సంబంధిత వస్తులు కొనుక్కురమ్మని స్థానిక మార్కెట్‌కి పంపారు. ఇద్దరు బాలురు తమ కొడుకుని అడ్డుకుని, స్థానికంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు’ అని బాధిత బాలుడి తండ్రి ఆరోపించారు. అంతేకాదు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి బాలుడి చేతిలో రూ.20 పెట్టి వెళ్లిపోయారన్నారు. ఊహించని ఘటనతో భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. బాలుడ్ని వెంటబెట్టుకుని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. నిందితులిద్దరూ బాధిత బాలుడి కుటుంబానికి సన్నిహితులేనని వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రియుడితో పెళ్లికోసం చిన్నారిని ఎత్తుకెళ్లిన యువతి

ఏడాదికి 50 కిలోల ఫుడ్ పడేస్తున్నం

14 ఏళ్ల బాలుడిని లోబరుచుకొని ప్రెగ్నెంట్ అయిన 23 ఏళ్ల యువతి

ఆకతాయిల వేధింపులు: నార్సింగిలో యువతి సూసైడ్