టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌ 

టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌ 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిపతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలుచుకుంది. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి ఈ పతకం సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు మరియు క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు ఎత్తి.. మొత్తంగా 202 కేజీలను ఎత్తింది. కరణం మల్లేశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి పతకం సాధించి రికార్డ్ నెలకొల్పింది. కరణం మల్లేశ్వరి 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.

ఇదే విభాగంలో చైనాకు చెందిన హో జిహు గోల్డ్ మెడల్ సాధించింది. జిహు 210 కేజీల బరువు ఎత్తి ఈ మెడల్ దక్కించుకుంది. ఇక ఇండోనేషియాకు చెందిన కాంటికా ఐసా 194 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం సాధించింది.

 

మరిన్ని వార్తలు