యేవమ్‌‌‌‌‌‌‌‌ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

యేవమ్‌‌‌‌‌‌‌‌ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

చాందిని చౌదరి లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ప్రకాష్‌‌‌‌‌‌‌‌ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్‌‌‌‌‌‌‌‌’. నవదీప్‌‌‌‌‌‌‌‌, పవన్‌‌‌‌‌‌‌‌ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం చాందిని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సౌమ్య అనే పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెటప్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఆడపిల్లని అయితే ఏంటంటా..’ అనే విధంగా, నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రజెంట్‌‌‌‌‌‌‌‌ చేసేలా  చాందిని పాత్ర ఉండబోతోంది. ఈ సినిమాకు తన నటన హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలవనుంది. కొత్త కంటెంట్‌‌‌‌‌‌‌‌తో, డిఫరెంట్ నెరేషన్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పాడు. వశిష్ట సింహా, జైభారత్‌‌‌‌‌‌‌‌, ఆషురెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.