ఎన్నికల ఎఫెక్ట్.. వేర్వేరుచోట్ల రూ.93 లక్షలు సీజ్

ఎన్నికల ఎఫెక్ట్.. వేర్వేరుచోట్ల రూ.93 లక్షలు సీజ్

కూకట్​పల్లి/బషీర్​బాగ్/సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలో శుక్రవారం వేర్వేరుచోట్ల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు రూ.93.05లక్షల క్యాష్​పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్​బీకాలనీ పరిధిలోని జేఎన్​టీయూ వద్ద బాలానగర్ ఎస్ఓటీ టీమ్, కేపీహెచ్​బీ పోలీసులు తనిఖీ చేస్తుండగా రైటర్​పీవీఎస్​లాజిస్టిక్స్​కు సంబంధించిన వెహికల్​అటుగా వచ్చింది. ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న రూ.25.50 లక్షలు పట్టుబడింది. నగదును స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్​చేశారు. అబిడ్స్ పోలీసులు హనుమాన్ టెక్డీ ప్రాంతంలో వెహికల్స్​తనిఖీ చేస్తుండగా, బైక్​పై వెళ్తున్న ఇద్దరి వద్ద రూ.49.75లక్షలు పట్టుబడింది. 

ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు. అలాగే మార్కెట్​పోలీసులు శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ ఆశా పాన్ షాప్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సంతోష్, కృష్ణ అనే బైక్​వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద రూ.17.80 లక్షల నగదు దొరికింది. తాము నిర్మల్ జువెలర్స్ లో పనిచేస్తన్నామని, షాపు యజమాని బ్యాంకులో డిపాజిట్​చేయమని చెప్పడంతో, తీసుకెళ్తున్నామని చెప్పారు. ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో పోలీసులు సీజ్​చేశారు.