
- 2026 లో ఢిల్లీ–గురుగ్రామ్ మధ్య మొదలుకానున్న మొదటి సర్వీస్
- ప్రకటించిన ఇండిగో-ఆర్చర్ ఏవియేషన్
న్యూఢిల్లీ: ఎంత ట్రాఫిక్ ఉన్నా నిమిషాల్లోనే గమ్యస్థానాలకు చేరుకునే రోజులు దగ్గర్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు నెలపై నడిచే ట్యాక్సీలు చూసుంటారు. ఇంకో రెండేళ్లలో గాల్లో తిరిగే ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్‌లైన్ కంపెనీ ఇండిగో, యూఎస్ కంపెనీ ఆర్చర్ ఏవియేషన్‌తో కలిసి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్‌ను తీసుకొస్తామని ప్రకటించింది.
2026 నాటికి ఈ సర్వీస్‌లను లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) వెహికల్స్‌ను ఇందుకోసం వాడనున్నారు. ఇవి హెలికాప్టర్ల మాదిరే పని చేస్తాయి. కానీ, తక్కువ సౌండ్, ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఎయిర్ ట్యాక్సీ సర్వీస్‌లు మొదట ఢిల్లీ–గురుగ్రామ్ రూట్‌లో ప్రారంభం కానున్నాయి. ఏడు నిమిషాల్లోనే గురుగ్రామ్ చేరుస్తాయి. ఢిల్లీలోని రాజీవ్ చౌక్ దగ్గర ప్యాసింజర్లను ఎక్కించుకుంటాయి.
ఈ సర్వీస్‌ల కోసం ఆర్చర్ ఏవియేషన్ 200 ఈవీటోల్ వెహికల్స్‌ను అందివ్వనుంది. ప్రతీ ఎయిర్ క్రాఫ్ట్ నలుగురు ప్యాసింజర్లను, ఒక పైలెట్‌ను మోసుకెళుతుంది. ఎయిర్ ట్యాక్సీ సర్వీస్‌లను ముంబై, బెంగళూరులో కూడా తీసుకురానున్నారు. ఒక ప్యాసింజర్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఛార్జీ వసూలు చేయొచ్చు. 27 కిలోమీటర్ల రైడ్‌కు రూ.1,500 ఖర్చవుతుందని ఆర్చర్ ఏవియేషన్ సీఈఓ ఆడమ్ గోల్‌స్టెయిన్ పేర్కొన్నారు. కాగా, ఇటువంటి సర్వీస్‌లు విస్తరించాలంటే ప్రభుత్వం ఎయిర్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ తీసుకురావాల్సి ఉంది.