OTT Thriller: ఓటీటీలో దూసుకెళ్తోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. ఆరు ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT Thriller: ఓటీటీలో దూసుకెళ్తోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. ఆరు ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

బాలీవుడ్ 'ధక్-ధక్ గర్ల్' మాధురి దీక్షిత్.. ఇటీవలే ఓటీటీలో గ్రాండ్ కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘మిసెస్ దేశ్‌పాండే’లో.. సీరియల్ కిల్లర్ పాత్రలో మాధురి దీక్షిత్ నటించి శభాష్ అనిపించుకుంది. ఈ సిరీస్ 19 డిసెంబరు 2025న నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చి ఆడియన్స్ను అలరిస్తుంది. జియో హాట్‌‌స్టార్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ వంటి భాషల్లో అందుబాటులో ఉంది. ఫ్రెంచ్ మినీ సిరీస్ ‘లా మాంటే’ అఫీషియల్ రీమేక్ ఇది. దానిని అలిస్ చెగ్రే - బ్రెగ్నోట్, నికోలస్ జీన్, గ్రెగోయిర్ డెమైసన్ రూపొందించారు.

‘మిసెస్ దేశ్‌పాండే’లో ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మాధురి దీక్షిత్‌తో పాటు, సిద్ధార్థ్ చందేకర్, ప్రియాన్షు ఛటర్జీ, దీక్షా జునేజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. గతంలో జరిగినటువంటి హత్యలు.. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ జరుగుతుండంతో సిటీ అట్టుడుకుతోంది. అయితే, ఇటువంటి ప్యాటర్న్ లో మర్డర్స్ చేసే అసలు హంతకురాలు శ్రీమతి దేశ్‌పాండే (మాధురి దీక్షిత్) 25 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. ఇక అచ్చం అలానే, బయట మర్డర్స్ జరగడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలవుతాయి. ఈ క్రమంలో కాపీ క్యాట్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు పోలీసులు.

అయితే, ఆ నకిలీ హంతకుడు చేసిన నేరాలను పట్టుకోవడానికి శ్రీమతి దేశ్‌పాండే సహాయం కోరుతారు. దీంతో పోలీసులకు ఆమె ఎలాంటి సహాయం చేసింది? అయితే, తాను నిజంగానే సాయం చేసిందా? లేదా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

►ALSO READ | Manchu Manoj: మహిళల వస్త్రధారణపై నీతులు చెబితే ఊరుకోం.. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలకు మనోజ్ కౌంటర్!

కథేంటంటే:

మిసెస్‌‌ సీమా దేశ్‌‌పాండే (మాధురీ దీక్షిత్) 25 సంవత్సరాలుగా హైదరాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్. సీమా జైలులో ఉండగానే  ఆమె చేసే స్టైల్‌‌లోనే ముంబైలో ఎవరో హత్యలు చేస్తుంటారు. ఆ సీరియల్ కిల్లర్‌‌‌‌ని కనిపెట్టేందుకు ఆఫీసర్‌‌‌‌ అరుణ్ ఖత్రి (ప్రియాన్షు ఛటర్జీ) ఎంట్రీ ఇస్తాడు. కేసు దర్యాప్తులో సాయంగా ఉంటుందని సీమని జైలు నుంచి బయటకు తీసుకొస్తాడు. ఆమెని ఒక సేఫ్‌‌ బిల్డింగ్‌‌లో ఉంచుతాడు. సీమతో కలిసి పని చేయడానికి ఏసీపీ తేజస్ ఫడ్కే (సిద్ధార్థ్ చందేకర్)ని నియమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హత్యలు చేసిందెవరు? తెలుసుకోవాలంటే సిరీస్‌‌ చూడాలి.