మే 2 నుంచి హరే కృష్ణ కల్చర్ ​క్యాంప్స్

మే 2 నుంచి హరే కృష్ణ కల్చర్ ​క్యాంప్స్

హైదరాబాద్, వెలుగు: సిటీలోని హరేకృష్ణ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆధ్వర్యంలో మే 2 నుంచి చిన్నారులకు కల్చర్​క్యాంప్స్​నిర్వహిస్తున్నారు. 21 రోజులు కొనసాగనున్న క్యాంపుల్లో శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యాలు, పూల అలంకరణలు, వక్తృత్వం, పెయింటింగ్, స్కెచింగ్, కథ చెప్పడం, భగవద్గీత శ్లోక పఠనం, మంత్ర ధ్యానం, యోగా, క్రాఫ్ట్స్, థియేటర్​ఆర్ట్స్​ నేర్పించనున్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌‌‌‌‌‌‌‌లో హరేకృష్ణ మూవ్‌‌‌‌‌‌‌‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీసత్య గౌరచంద్రదాస ప్రభుజీ ‘కల్చర్​క్యాంప్​2024’ పేరుతో రూపొందించిన క్యాంపుల పోస్టర్​ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం మినహా ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 2.45 వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 6 నుంచి 16 ఏండ్ల వయస్సు గల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందిస్తామని, చివరిరోజు సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 81436 55188లో సంప్రదించాలని సూచించారు.  బంజారాహిల్స్​హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్,  కోకాపేట హరే కృష్ణ హెరిటేజ్ టవర్, కందిలోని హరే కృష్ణ కల్చరల్ సెంటర్, కాచిగూడ వైశ్య హాస్టల్, కొల్లూరు మాగ్నాస్ మెజెస్టిక్ మెడోస్, కోకాపేట రాజపుష్ప అట్రియా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ లో క్యాంపులు ఉంటాయని వెల్లడించారు.