ధైర్యం, పట్టుదలతో మిరాయ్

ధైర్యం, పట్టుదలతో మిరాయ్

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాయ్’.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాంగ్‌‌‌‌‌‌‌‌కు  మంచి రెస్పాన్స్ రాగా, శనివారం  తేజ సజ్జ బర్త్‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా తన కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేశారు మేకర్స్. ఇందులో  తేజ సూపర్ యోధ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించాడు. 

 కూలిపోతున్న వంతెన మీద  నిలబడి పోరాడుతున్నట్టుగా ఉన్న తన  లుక్ ఆకట్టుకుంది.  పాత్రలో ఉన్న పట్టుదల, ధైర్యం.. ‘ మిరాయ్‌‌‌‌‌‌‌‌’లో ఉన్న  హై వోల్టేజ్ డ్రామాని రిప్రజెంట్ చేస్తుంది.  రితికా నాయక్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  మనోజ్ మంచు విలన్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు.  శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నాడు.  

సెప్టెంబర్ 5న 2డి, 3డి ఫార్మాట్స్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది భాషల్లో సినిమా విడుదల కానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కరణ్ జోహర్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు.

పీపుల్స్‌‌ మీడియాలో మరో సినిమా

‘మిరాయ్‌‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌లో మరో చిత్రం చేయబోతున్నాడు తేజ సజ్జా. తన బర్త్‌‌ డే సందర్భంగా కాన్సెప్ట్‌‌ పోస్టర్‌‌‌‌తో ఈ ప్రాజెక్ట్‌‌ను అనౌన్స్‌‌ చేశారు. గేమింగ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే థ్రిల్లర్ ఇదని అర్థమవుతోంది.  2027 సంక్రాంతికి దీన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.