రూ.22 వేలు ఉన్న మిర్చి ధర.. రూ.13 వేలకి పడిపోవడంతో..

రూ.22 వేలు ఉన్న మిర్చి ధర.. రూ.13 వేలకి పడిపోవడంతో..

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి ధర భారీగా పడిపోయిందంటూ మార్కెట్ గేటుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. నెల రోజుల క్రితం రూ.22 వేలు ఉన్న మిర్చి ధర….. గురువారం రూ.13 వేలే ఉండటంతో రైతులు నిరసన తెలిపారు. మిర్చి పొలాల్లో  ఉన్నప్పుడు రికార్డు ధరలు పెట్టి.. పంటను తీసుకొచ్చిన తర్వాత  కనీస ధరలు కూడా ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట రూ.13 వేలుగా మొదలు పెడితే రైతుకు వచ్చేది 10 వేల లోపే అన్నారు. ఈ ధరకు మిర్చి పంటను అమ్ముకుంటే కనీసం కూలీల ఖర్చు కూడా రావడం లేదన్నారు  రైతులు. వ్యవసాయ కమిటీ సిబ్బంది మాత్రం అంతర్జాతీయంగా మిర్చి ధర తగ్గిందని, అందువల్లే మార్కెట్ లో రేటు తగ్గిందని అంటున్నారు.