
బిగ్ బాస్’ ఫేమ్ అశ్విని శ్రీ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘మిస్ జానకి’. తనికెళ్ళ భరణి, అలీ, చిత్రం శ్రీను, మహేష్ కుమార్, లోబో, శాని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సతీష్ కుమార్ దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అతిథులుగా హాజరైన నిర్మాతలు సి కళ్యాణ్ క్లాప్ కొట్టగా, దామోదర ప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా అశ్విని శ్రీ మాట్లాడుతూ ‘‘బిగ్ బాస్’ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించే చాన్స్ రావడం హ్యాపీ. ఇందులో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ‘డీజే టిల్లు’లో రాధిక పాత్రలా అందరికీ గుర్తుండిపోతుంది’ అని చెప్పింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.