మిస్ యూనివర్స్ 2022గా బొన్ని గాబ్రియేల్

మిస్ యూనివర్స్ 2022గా బొన్ని గాబ్రియేల్

మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని ఈ సారి అమెరికా దక్కించుకుంది. 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీలో యూఎస్ కు చెందిన బొన్ని గాబ్రియేల్ విజేతగా నిలిచింది. అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన మిస్ యూనియవర్స్ పోటీల్లో 2021 మిస్ యూనివర్స్ భారత్ కు చెందిన హర్నాజ్ సంధు, బొన్ని గాబ్రియేల్ కు విశ్వ సుందరి కిరీటాన్ని తొడిగింది. గ్రాండ్ ఫినాలేలో విజయం సాధించిన బొన్ని.. డైమండ్స్, క్రిస్టల్స్ పొదిగిన గౌన్ లో జిగేల్ మంది.

మిస్ యూనివర్స్ 2022లో వెనుజులా సుందరి అమండా దుడామెల్ మొదటి రన్నరప్ గా నిలవగా.. డొమినికల్ రిపబ్లిక్ భామ అండ్రీనా మార్టినెజ్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఇండియా నుంచి కర్నాటకు చెందిన దివితా రాయ్ ఈసారి విశ్వసుందరి పోటీల్లో పాల్గొనగా.. 80 మంది అందగత్తెల్లో ఆమె 16వ స్థానంలో నిలిచింది. కాగా భారత్ ఇప్పటి వరకు మూడుసార్లు మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు విశ్వసుందరిగా నిలిచారు.