
మిస్‌వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి సిటీకి తరలివచ్చిన అందాల భామలు మంగళవారం పాతబస్తీలో సందడి చేశారు. చార్మినార్ వద్ద నిర్వహించిన హెరిటేజ్ వాక్‌లో పాల్గొని హొయలొలికారు. స్థానిక కళాకారుల అరబ్బీ మార్ఫా వాయిద్యాలకు స్టెప్పులేశారు. హైదరాబాద్కు ఐకాన్ అయిన చార్మినార్తో సెల్ఫీలు తీసుకున్నారు. పక్కనే ఉన్న లాడ్ బజార్లో షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువులు కొనుక్కున్నారు.
వారు కొన్న ఏ వస్తువుకూ వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయంలో భాగమైన గాజుల గురించి వివరించారు.షాపింగ్ అనంతరం కంటెస్టెంట్లు రెడ్ కార్పెట్‌పై వాక్చేసుకుంటూ చౌమహల్లా ప్యాలెస్ చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ విందులో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పలువురు సినీ తారలు తళుక్కుమన్నారు.
వెలుగు, హైదరాబాద్ సిటీ