హైదరాబాద్​లో ముగిసిన హెడ్-టు-హెడ్ చాలెంజ్.. టాలెంట్​రౌండ్​లో 24 దేశాలు ఎంపిక

హైదరాబాద్​లో ముగిసిన హెడ్-టు-హెడ్ చాలెంజ్.. టాలెంట్​రౌండ్​లో 24  దేశాలు ఎంపిక
  • నేడు శిల్పారామాన్ని సందర్శించనున్న అందాల భామలు

హైదరాబాద్, వెలుగు:  మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్​లోని టీ–హబ్​లో నిర్వహించిన హెడ్- టు-హెడ్ చాలెంజ్ బుధవారం ముగిసింది. పోటీదారులను రెండు బృందాలుగా విభజించగా.. తొలిరోజు అమెరికా, కరేబియన్​, ఆఫ్రికా దేశాల పోటీదారులు తమ ఆలోచనలు పంచుకున్నారు. రెండో రోజు బుధవారం యూరప్, ఆసియా, ఓషియానియా ప్రతినిధులు వేదికపై తమ ఆలోచనలను పంచుకోవడంతోపాటు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు.

 టాలెంట్​రౌండ్​కు 24 దేశాలు ఎంపికైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఈవెంట్​మిస్ వరల్డ్ యూట్యూబ్ చానల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.  కాగా..మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గురువారం ఉదయం 8.30 గంటలకు మాదాపూర్ శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించనున్నారు. మహిళా స్వయం సహాయక బృందాల వ్యాపార అనుభవాలను తెలుసుకోనున్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ సాధిస్తున్న మహిళా ఆర్థిక సాధికారత పై వీడియో ప్రదర్శనను తిలకించనున్నారు. స్వయం ఉపాధి నుంచి సంపద సృష్టి వరకు స్వయం సహాయక బృందాలు సాధిస్తున్న విజయాలను మంత్రి సీతక్క వివరించనున్నారు. అంతేకాకుండా, కొత్తపేటలోని విక్టోరియా మోమెరియల్​హోమ్​సందర్శిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు శిల్పాకళా వేదికలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.