Miss World 2025 :మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్ చేరుకున్న బ్రెజిల్ బ్యూటీ జెస్సికా

Miss World 2025 :మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్ చేరుకున్న బ్రెజిల్ బ్యూటీ జెస్సికా

హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల సందడి మొదలైంది. మే10న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో ప్రపంచ అందగత్తెలు ఒక్కొక్కరుగా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఈ కంటెస్ట్ లో పాల్గొనేందుకు బ్రెజిల్ సుందరి జెస్సికా స్కాండుజ్ పెద్రోసో ఆదివారం (మే4) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారుల బృందం సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ రెడీ అయ్యింది. మే 10నుంచి మే 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. మూడు వారాలపాటు 120 దేశాలకు చెందిన అందగత్తెలు హైదరాబాద్ లో సందడి చేయనున్నారు. ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. తొలిసారి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి.  

గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మే 31న ఫైనల్స్ ఉంటాయి. ఈ పోటీల్లో పాల్గొనే బ్యూటీలు మే 8లోపు హైదరాబాద్ చేరుకోనున్నారు. తొలిసారి హైదరాబాద్ లో జరగనున్న ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వివిధ దేశాల సుందరీమణులు, వారి ప్రతినిధులు పాల్గొంటారు.