
వెలుగు హైదరాబాద్: మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మంగళవారం టీ–హబ్ లో సందడి చేశారు. కాంటినెంటల్ ఫినాలే పోటీల్లో భాగంగా పోటీదారులు రెండు బృందాలుగా ఏర్పడి హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
తొలిరోజు అమెరికా, కరేబియన్, ఆఫ్రికా దేశాల పోటీదారులు ఆలోచనలు పంచుకుని, తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. బుధవారం యూరప్, ఆసియా, ఓషియానియా ప్రతినిధులు వేదికపై తమ ఆలోచనలను పంచుకోనున్నారు.